Sreenivas Paruchuri తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;Sreenivas Paruchuri

అన్నపూర్ణగారు,
వేదుల ఖమ్మంలో పుట్టారు. కాకినాడలో ఉద్యోగం చేశారు. పండితుడు, కవి, వేదాలని మొదటిగా తెలుగులో ప్రచురించిన బంకుపల్లి మల్లయ్యశాస్త్రి వితంతు కుమార్తె కృష్ణవేణిని పెళ్లి చేసుకున్నారు. ఆయన గురించిన వికీలోను, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి రాసిన “ఆంధ్ర రచయితలు” (1940) చూడవచ్చు.

ఆయన గొంతుక వినవచ్చు.


04 April 2024 9:46 PM

చలనచిత్ర దృశ్యగీతం;Sreenivas Paruchuri

రాజేంద్ర గారు,

సాలూరి వారికి మధ్య ప్రాచ్యంలో బహు జనాదరణ పొందిన "Ye mustafaa" అన్న పాట బాణీ బాగా నచ్చి తెలుగులో దానిని అనుకరించారు. ఈ "ముస్తఫా" పాట ఎంత ప్రఖ్యాతి గాంచినదో తెలుసుకోవాలంటే YouTube లాంటి చోట వెతికి చూడండి :-) అనేక రంగులు, రుచులు, రూపాలు, వాసనల్లో కనపడుతుంది.

-- శ్రీనివాస్

08 August 2008 11:14 AM

చలనచిత్ర దృశ్యగీతం;Sreenivas Paruchuri

నాకైతే తెలుగు పాటకీ, ఈ ఇంగ్లీషు పాటకి ఛాయా మాత్రంగానైనా పోలికలు కనపడలేదు. నాకు తెలిసినంతలో ఈ పాటకు స్ఫూర్తి Mexican Merry go round అనే ప్రఖ్యాతి గాంచిన పాట. Edmundo Ros అనే *గోప్ప* పేరున్న గాయకుడు పాడిన వెర్షన్ తేలికగా లభ్యమవుతుంది. ఇక్కడ ఒక 30 సెకన్ల పాటు ఆయన గొంతుకలో వినవచ్చు:
http://www.soundflavor.com/popoutplayer.php?qs=1_5077101_-1

1936 లో ఇదే కథ "శశిరేఖా పరిణయం" (మాయాబజార్) అన్న పేరుతో వచ్చింది. ఆ సినిమాలో దాదాపుగా యిదే పాఠం, దరిదాపుగా అదే ట్యూనులో (నేనైతే ఈ పాట వినలేదు. వే.ఆ.కృ. రంగారావు గారు నాతో చెప్పిన మాటిది.) వచ్చింది. ఇదే సినిమాలో సాలూరి రాజేశ్వరరావు అభిమన్యుడి పాత్రలో కనిపించడం, ఒక రెండు (నాకు తెలిసి, నా దగ్గరున్నవి) పాటలు పాడటం జరిగింది.

బొల్లోజు బాబా గారడిగిన ప్రశ్నకు: మీరడిగిన గొంతులన్నీ--> చలాన్ని రజనీకాంతరావు గారు చేసిన గంట పాటు ఇంటర్వ్యూ, విశ్వనాథ స్వయంగా చదివిన కిన్నెరసాని పాటలు, రెండు abruptగా ముగిసే దేవులపల్లి ఉపన్యాసాలు, నేను గతంలో "ఈమాట"లో పెట్టడం జరిగింది. శ్రీశ్రీ ఇంటర్వ్యూలు, సమర్పించిన జనరంజనులు, కవితా పఠనాలు, మరోసారి ఈమాట లోనే పెడతాను.
-- శ్రీనివాస్

17 July 2008 2:39 AM